జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆపార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం లోని చిత్రాడ వేదికగా జరిగిన ‘జయకేతనం’ సభలో భారీగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేశారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
పవన్ ప్రసంగం హైలెట్స్:
దేశమంతా తల తిప్పి చూసేలా 100% విజయంతో ఘన విజయం సాధించాం.ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటుని కూడా తాకలేవ్అని ఛాలెంజ్ చేసి కొట్టిన తొడలని విరిచాం.దేశమంతా తల తిప్పి చూసేలా 100% విజయంతో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమిని నిలబెట్టాం,ఈ రోజు జయకేతనం ఎగరేస్తున్నాం.
భావ తీవ్రత ఉంది కనుకే పోరాట యాత్ర చేశాం. ఓటమి భయంలేదు కాబట్టే 2019లో పోటీచేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకోవడమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు. జనసైనికులు ప్రశ్ని్స్తే వారిపై కేసులు పెట్టారు. టీడీపీ నేతలను రోడ్డు మీదకు రావాలంటే భయపడేలా చేశారు. జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రా అయ్యింది. పార్టీ పెట్టాలంటే నాన్న సీఎం అయి ఉండాలా? మామయ్య కేంద్రమంత్రి అయి ఉండాలా? బాబాయిని చంపించి ఉండాలా.?దశాబ్దం పాటు తిట్లు భరించాలంటే ఎంత నలిగి ఉండాలి…?
>తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది. హోలీరోజున జయకేతనం ఎగరవేయడం ఆ దేవుడి దీవెన. దేశ ఐక్యతకు బహుభాషలు కావాలి. 2003లో నేను రాజకీయాల్లోకి వెళ్తానని మా అమ్మకు చెప్పాను. ఖుషీ సినిమా నుంచి గద్దరన్నతో నాకు స్నేహం. మన 11వ సంవత్సరం వాళ్ల 11కు అంకితం.
నేను కర్మ చేస్తాను, ఫలిత ఆశించను. భయాలు, బాధ్యతల మధ్య జీవితం సాగించాను. జనసేన కోసం 7 సిద్ధాంతాలు చాలా ఆలోచించి పెట్టినవి. 100 శాతం స్ట్రైక్‌రేట్ సాధించామంటే దానికి జనసేన సిద్ధాంతాలే కారణం. భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వాన్ని చూడటమే నా ఐడియాలజీ.
దేశమంతా తల తిప్పి చూసేలా 100% విజయంతో ఘన విజయం సాధించాం:జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్
By admin2 Mins Read

