తెలుగువారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములుగారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢసంకల్పానికి నిదర్శనమని కొనియాడారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ..ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందామని పేర్కొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పలువురు నాయకులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. విజయవాడ సామరంగ్ చౌక్ సెంటర్ లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఎంపీ కేశినేని చిన్ని పూలమాలవేసి నివాళులు అర్పించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పొట్టి శ్రీరాములు గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు.. ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
Previous Articleశ్రీవారి కళ్యాణంతో రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article అస్వస్థతకు గురైన ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్