విభిన్నమైన వినోదాత్మక చిత్రాలు తీస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి. ఈఏడాది సంక్రాంతికి సీనియర్ కధానాయకుడు విక్టరీ వెంకటేశ్ తో ఆయన తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో అనిల్ అగ్ర కధానాయకుడు, లెజెండరీ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారు. 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. తాజాగా ఆయన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా ఉన్నారు. చిరుతో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పూజల అనంతరం అనిల్ రావిపూడి విలేకర్లతో మాట్లాడారు. తన చిత్రాల కథలకు విశాఖను తాను సెంటిమెంట్‌గా భావిస్తానని తెలిపారు. అందుకే మెగాస్టార్‌తో తీయబోయే చిత్రానికి సంబంధించిన కథను సిద్ధం చేసేందుకు వైజాగ్ వచ్చినట్లు తెలిపారు. ఇక మెగాస్టార్ తో తీసే సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు