వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. నేడు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రమాణస్వీకారం మీదనే పీపీఏల రద్దు అంటూ, మొత్తం ఎనర్జీ రంగాన్ని కుప్ప కూల్చిన వ్యక్తి జగన్, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ట్రూఅప్ చార్జీల భారంతో ఇబ్బంది పడుతున్నారు అంటే, నాటి జగన్ కక్ష పూరిత వైఖరే కారణం కాదా ? మీరా ఇండస్ట్రీలు గురించి మాట్లాడేది ? అని వైసీపీ తీరును ఎండగట్టారు. ఇక రైల్వే జోన్ కి భూమి కూడా ఇవ్వని వారు, ఈ రోజు ప్రధాని శంకుస్థాపన చేస్తే మా ఘనత అని చెప్పుకుని తిరుగుతున్న వైసీపీ వారికి దండం పెట్టాలని ఎద్దేవా చేశారు. సాఫ్ట్ వేర్ ఒక్కటే కాదు, అండర్ వేర్ కంపెనీలను కూడా రాష్ట్రం నుండి తరిమేసిన చరిత్ర వైసీపీదని విమర్శించారు.
ట్రూఅప్ చార్జీలతో ప్రజల ఇబ్బందులకు నాటి జగన్ కక్ష పూరిత వైఖరే కారణం కాదా?: మంత్రి పయ్యావుల కేశవ్
By admin1 Min Read