మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ చిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. 2019లో విడుదలైన ‘లూసిఫర్’ సినిమాకు ఇది సీక్వెల్ కాగా, మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో దీనిపై భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించగా, తాజాగా తెలుగు ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. “మనిషి ప్రాణం కంటే ఏదీ విలువైంది కాదు” అనే డైలాగ్ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టీఫెన్ గట్టుపల్లి ఎవరు? ఒక సాధారణ ఎమ్మెల్యే అయిన అతనిని ముంబై మాఫియా సహా అంతర్జాతీయ ఏజెన్సీలు ఎందుకు భయపడుతున్నాయి? వంటి ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానం దొరకనుంది. మంజు వారియర్, టొవినో థామస్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుండగా, తెలుగులో దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

