విజయవాడ ఏ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన సభ్యులకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం సభ్యులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వింటుందని సభ్యులనుద్దేశించి అన్నారు.
గతేడాది వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగితే వారి బూతులు వినలేక ప్రజలు టీవీలు కట్టేసేవారు. కానీ ఇప్పుడు గర్వంగా చెప్తున్నా…కౌరవ సభ గౌరవ సభగా మారింది. ప్రజలకు కావాల్సింది సమస్యల పరిష్కారం. బూతులు తిడితే తిట్టిన వారికి ఆనందం కలిగిస్తాయి తప్ప, ప్రజలకు కాదని పేర్కొన్నారు. ప్రతిపక్షం, అధికార పక్షం అనేది ప్రజాసమస్యలపై పోరాడటానికి తప్ప వ్యక్తిగత విభేదాలు పెట్టుకోవడానికి కాదని పేర్కొన్నారు . ఒకప్పుడు సభ్యులంతా ఆప్యాయంగా పలకరించుకునేవాళ్లం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం అయ్యాయి. బద్దశత్రువులుగా మారారు. అసెంబ్లీ అనేది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్ప ప్రతిపక్షాలకు కాదని స్పష్టం చేశారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

