ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రూ.8003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం ఓ రికార్డు అని పేర్కొన్నారు. ఆయన తాజాగా తెనాలిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలన చీకటి రోజుల నుంచి అన్నదాతను బయటకు తెస్తున్నామని చెప్పారు.ఖరీఫ్ స్ఫూర్తితో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లు వివరించారు. తేమ శాతం సమస్యలు, తూకం సమస్యలు, గోతాముల కొరత, రవాణా ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసానిచ్చారు.గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే 746 శాతం అధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని పునరుద్ఘాటించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

