ఇటీవల బాలీవుడ్‌లో భారీ విజయం సాధించిన హిస్టారికల్ సినిమా “ఛావా” ఇప్పుడు మరో ఘనత సాధించబోతోంది.ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం భారత పార్లమెంట్‌లో ప్రత్యేక ప్రదర్శన పొందనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.మార్చి 27న సాయంత్రం 6 గంటలకు పార్లమెంట్‌లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరగనుందని,దేశవ్యాప్తంగా ఎంపీలు హాజరుకానున్నారని సమాచారం.ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.అయితే ఈ వార్తలపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.‘ఛావా’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఎంతో అభిమానం పెరిగింది.ఇప్పుడు పార్లమెంటరీ ప్రదర్శన ద్వారా ఈ సినిమా మరింత గుర్తింపు పొందబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు