స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న చిత్రం ‘జాక్’ విడుదలకు సిద్ధమైంది.ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. వేసవి కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు పూర్తి చేసింది. ప్రమోషన్స్‌ను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌గా ఏప్రిల్ 2న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అప్డేట్‌తో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సిద్ధు ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కాగా, ప్రేక్షకులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Previous Articleశ్రీ సరస్వతీ విద్యామందిర్ పాఠశాల నూతన భవనాల నిర్మాణ శంకుస్థాపన
Next Article అల్లు అర్జున్ – అట్లీ చిత్రం నుండి క్రేజీ అప్‌డేట్!