ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకొన్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పేదలకు పట్టాభిషేకం.. మంగళగిరి పేద ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని పేర్కొన్నారు. మన ఇల్లు -మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇళ్ల పట్టాలు అందించారు . అనంతరం మాట్లాడుతూ శాశ్వత హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు అందించాను. పట్టాలు అందుకున్న వారి ఆనందం వెల కట్టలేనిదని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని లోకేష్ అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అత్యధిక మెజారిటీతో తనను గెలిపించిన ప్రజల కోసం అహార్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ‘సూపర్ సిక్స్ ‘ హామీలతో పాటు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఈనెల 13న 100 బెడ్స్ హాస్పిటల్ కు శంకుస్థాపన చేసి సరిగ్గా సంవత్సరానికి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్లు అదే విధంగా దుగ్గిరాలలోనూ మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నట్లు వివరించారు. నీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నాం. నిరుపేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టుమిషన్లు అందజేశామని మంత్రి పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు