రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 221-5 (20).
ముంబై ఇండియన్స్: 209-9 (20).
ఐపీఎల్ సీజన్ 18 లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో బెంగళూరు పైచేయి సాధించింది. 12 పరుగుల తేడాతో గెలిచి దశాబ్దం తర్వాత వాంఖడే లో జెండా ఎగరేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ సొసైటీ బెంగళూరు విరాట్ కోహ్లీ 67 (42; 8×4, 2×6), రజత్ పటేదార్ 64 (32; 5×4, 4×6) , పడిక్కల్ 37 (22; 2×4, 3×6), జితేష్ శర్మ 40 నాటౌట్ (19; 2×4, 4×6) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్థిక్ పాండ్య 2 వికెట్లు, బౌల్ట్ 2 వికెట్లు, విఘ్నేష్ పుతుర్ 1 వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ గొప్పగా పోరాడింది. తిలక్ వర్మ 56 (29; 4×4, 4×6), హార్థిక్ పాండ్య 42 (15; 3×4, 4×6)లు గెలుపు అంచుల దాకా తీసుకెళ్ళినా వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్.సీ.బీ బౌలర్లలో కృనాల్ పాండ్య 4 వికెట్లు, హేజల్ వుడ్ 2 వికెట్లు, యశ్ దయాళ్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు