ఇంగ్లాండ్ లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కు కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ నియమితుడయ్యాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు పేలవ ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో జాస్ బట్లర్ కెప్టెన్సీ నుండి వైదొలిగిన విషయం విదితమే. ఇక ఐపీఎల్ లో అతనిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయగా తన నేషనల్ టీమ్ కు ప్రాధాన్యత ఇచ్చుకుంటానని అతడు ఈ సీజన్ ఐపీఎల్ నుండి వైదొలిగాడు. దీంతో ఈ లీగ్ లో ఆడకుండా రెండేళ్ల నిషేధానికి గురయ్యాడు. 2022లో ఇంగ్లాండ్ కు అరంగ్రేటం చేసిన బ్రూక్ ఏడాది నుండి వన్డేలు, టీ 20లలో వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఇంగ్లాండ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ‘ఇంగ్లాండ్ వైట్ బాల్ క్రికెట్ కు కెప్టెన్ గా ఎంపికవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక 24 టెస్టుల్లో ఇంగ్లాండ్ కు ఈ ఆటగాడు ప్రాతినిథ్యం వహించాడు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

