మంగళగిరి సమీపం చినకాకాని వద్ద వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఏపీ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. కూటమి నేతలతో కలిసి భూమిపూజ నిర్వహించిన అనంతరం శిలఫలకాన్ని ఆవిష్కరించారు. 1984లో స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు వైవీసీ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకం వద్ద లోకేష్ సెల్ఫీ దిగారు. మంగళగిరి పట్టణంలో 40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి అన్న ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల తర్వాత 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నేను శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి. ఏడాదిలోగా ఆ కలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా చెప్పారు.
Previous Articleఅనకాపల్లి జిల్లా, కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం: సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Next Article పీఎంవోకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు