ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 16వ ఫైనాన్స్ కమీషన్ తో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఫైనాన్స్ కమిషన్‌కు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతించారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రతినిధులకు సీఎం వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు చూపారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వీడియో ద్వారా ప్రదర్శించి వివరించారు. రాష్ట్ర విభజన ప్రభావం, ఆర్థిక సవాళ్లు, 2014 తరువాత వృద్ధిరేటులో రాష్ట్రం సాధించిన ప్రగతి, ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆర్థిక సంఘానికి వివరరించారు.
ఏపీ ప్రభుత్వం 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తున్నట్లు సీఎం తెలిపారు . ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా సమర్థవంతమైన నిర్ణయాలతో, ఉత్తమ పాలసీలతో పాలన సాగిస్తూ సమస్యలను అధిగమిస్తున్నట్లు తెలిపారు. 2019 తరువాత నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన రాష్ట్ర ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని వారికి సీఎం వివరించారు. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని ఆయన దేశానికి చేస్తున్న సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ వైపు ప్రయాణిస్తోందని పేర్కొన్నారు.
Previous Articleనేడూ లాభాల్లో నే దేశీయ స్టాక్ మార్కెట్లు..!
Next Article తదుపరి సీజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్…!