తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకను జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన అవార్డుల కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు. ఇక ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సినీ రంగ నిపుణులతో కూడిన జ్యూరీని ఏర్పాటు చేసినట్టు కూడా వివరించారు. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చలనచిత్ర పురస్కారాలను అందిస్తోందని దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ గుర్తుచేశారు. ఈ పురస్కారాలకు సినీ పరిశ్రమ నుండి మంచి స్పందన వచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 1,248 నామినేషన్లు అందినట్లు పేర్కొన్నారు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా అవార్డుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Previous Articleఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్: విజయసాయిరెడ్డి
Next Article కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలు