విదేశీ పర్యటన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భారత్ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో నేడు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, అప్పలనాయుడు, హరీష్ బాలయోగి, సానా సతీష్ తదితరులు ఉన్నారు. ఇక ఈ భేటీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విడుదల, పనుల పురోగతిపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పలు అంశాల్లో కేంద్ర సహాకారాన్ని కోరారు. కేంద్ర న్యాయ శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘవాల్,కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్ తో కూడా సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
Previous Articleజూన్ 14న హైదరాబాద్ లో ఘనంగా ‘గద్దర్’ అవార్డుల వేడుక
Next Article యూపీఎస్సీ రిజల్ట్స్-2024…సత్తా చాటిన పలువురు