ఐపీఎల్ సీజన్ 18 లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస పరాజయాలతో సతమతమవుతూనే ఉంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ లలో కేవలం 2 మ్యాచ్ లలో మాత్రమే గెలిచి పేలవ ఆటతీరుతో అభిమానులను నిరాశ పరుస్తోంది. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్లాసిన్ 71 (44; 9×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. అభినవ్ మనోహర్ 43 (37; 2×4, 3×6) మినహా మిగిలిన బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు, దీపక్ చాహార్ 2 వికెట్లు, బుమ్రా, హార్థిక్ పాండ్య ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్యాన్ని ముంబై అలవోకగా 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ 70 (46; 8×4, 3×6) సీజన్ లో వరుసగా రెండో సారి హాఫ్ సెంచరీతో రాణించాడు. సూర్య కుమార్ యాదవ్ 40 నాటౌట్ (19; 5×4, 2×6) మంచి ప్రదర్శన కనబరిచాడు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, ఈషన్ మలింగా, జీషన్ అన్సారీ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్ 4 లోకి దూసుకెళ్లింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు