పోలవరం ఎత్తు తగ్గించి ఆర్థిక భారం తగ్గించుకోవాలని చూడడం బీజేపీ కుట్ర అని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. పోలవరం విషయంలో జగన్, బాబు, బీజేపీ అంతా దుర్మార్గులేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ గారు బీజేపీతో 41.15 మీటర్ల ఎత్తుకు ఒప్పందం చేసుకున్నారు. పోలవరం మీద జగన్ కాంప్రమైజ్ అయ్యారు. వైఎస్ ఆర్ కొడుకు జగన్ గారు అని ప్రజలు అధికారం ఇచ్చారు. జగన్ గారు అధికారంలో వస్తే ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని అనుకున్నారు. కానీ దారుణంగా మోసం చేశారు. ఇప్పుడు అదే విధానాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు.. . 45.7 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 85 వేల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. 41.15మీటర్లకు కుదిస్తే 20వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇవ్వాలి. 65వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.33వేల కోట్ల పరిహారం ఎగ్గొటేందుకు ఎత్తు తగ్గించారని ఆరోపించారు.
ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పోలవరంపై కపట ప్రేమ చూపించారు. పోలవరం ఎత్తు తగ్గితే వినాశనమే అన్నారు. జగన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలని అన్నారు. నీటి నిల్వను 194TMCల నుంచి 114 TMCలకు తగ్గించారు. ఇప్పుడు పోలవరం పక్కనపెట్టి రూ.80వేల కోట్ల అంచనా వ్యయంతో గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ అంటున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించారు. పోలవరం 45.7 మీటర్ల ఎత్తులో నిర్మించాలని డిమాండ్ చేశారు.
Previous Articleమాడ్రిడ్ ఓపెన్ లో మొదటి రౌండ్ లోనే ఓడిన జకోవిచ్
Next Article NIAకు పహాల్గాం ఉగ్రదాడి కేసు..!