ఏపీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి పారితోషికాలను గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (జీఓ) జారీ చేసింది. పెంచిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు గెస్ట్ లెక్చరర్లు కాదు, మన యువత భవిష్యత్తుకు మార్గదర్శకులని వారి సేవలకు న్యాయం చేయాలనే సంకల్పంతో జీతాలు పెంచామని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా గంటకు ఇస్తున్న రూ.150 పారితోషికాన్ని గంటకు రూ.375 కి పెంచడం ద్వారా నెల వారీ పారితోషికం గరిష్టంగా 10,000 నుండి ₹27,000 కు పెరిగింది. ఇది వారి ప్రతిభకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవమని పేర్కొన్నారు.
గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్ …ఇది వారి ప్రతిభకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం: మంత్రి నారా లోకేష్
By admin1 Min Read