దేశ సైన్యానికి, నాయకత్వానికి దేవ సేనాని శక్తినివ్వాలని జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ సుబ్రహ్మణ్యుడి ఆశీస్సులతో ముష్కర మూకల ఆటకట్టించాలని ఆకాంక్షించారు. ఆపరేషన్ సిందూర్ తో దేశానికున్న ఆపదలు దూరం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశంతో రాష్ట్రంలోని పలు శ్రీ సుబ్రహ్మణ్య ఆలయాలు, అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్య క్షేత్రంలో మంత్రి శ్రీ కందుల దుర్గేష్ ప్రత్యేక పూజలు చేశారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్ అదే విధంగా పిఠాపురం శక్తి పీఠంలో జనసేన నేతల పూజలు చేశారు. పళని క్షేత్రంలో ఎమ్మెల్యే పంతం నానాజీ పళనిలో, ఎమ్మెల్యే సుందరపు విజయ్ తమిళనాడు లోని మధురై లో ఉన్న ప్రాముఖ్యమైన మధుర మీనాక్షి దేవాలయం, తిరుపురంకుండ్రమ్ అరుల్మీగు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను దర్శించి దేశం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశ క్షేమం కోరుకుంటూ శ్రీ సుబ్రహ్మణ్య ఆలయాలు, అమ్మవారి ఆలయాల్లో జనసేన నేతల పూజలు
By admin1 Min Read