ఐపీఎల్ సీజన్ 18 లో ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన సన్ రైజర్స్ వరుసగా రెండో గెలుపు ఖాతాలో వేసుకుంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ 94 నాటౌట్ (48; 7×4, 5×6) కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అభిషేక్ శర్మ 34 (17; 3×4, 3×6), ఆనికేత్ వర్మ (26), క్లాసీన్ (24) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో షెపర్డ్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, ఎంగిడి, ఎస్.శర్మ, కృనాల్ పాండ్య ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటయింది. ఫిల్ సాల్ట్ 62 (32; 4×4, 5×6), విరాట్ కోహ్లీ 43 (25; 7×4, 1×6) , జితేష్ శర్మ (24) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 3 వికెట్లు, ఇ.మలింగ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి, హెచ్.దూబే, హర్షల్ పటేల్, ఉనద్కత్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు