ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. వారితో ఏపీ అభివృద్ధిపై చర్చించిన అంశాలను వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టటానికి, అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక పక్క 9.74 లక్షల కోట్ల అప్పు, మరో పక్క బకాయిలతో కనీస వెసులబాటు కూడా లేకుండా చేశారని విమర్శించారు . అయితే ప్రజలు తమ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నామని అన్నారు. ఒక పక్క రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసుకుంటూనే, కేంద్ర సాయంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. శాంతిభద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్షించారు. శాంతిభద్రతల కోసం ఆయన కొన్ని సూచనలు చేశారు. అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కోరాం.. సానుకూలంగా స్పందించారని సీఎం తెలిపారు. ఇక సూర్యఘర్ కింద 35లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10వేల కుటుంబాలకు విద్యుత్ ఇస్తాం. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీని కోరామని తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. జగ్గయ్యపేట-డోలకొండ క్లస్టర్ లో 6వేల ఎకరాలు అందుబాటులో ఉంది. ఈ క్లస్టర్ లో మిసైల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. లేపాక్షి-మడకశిర క్లస్టర్ లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ , ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరాం. విశాఖ- అనకాపల్లి క్లస్టర్ లో నేవల్ ఎక్స్ పర్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. కర్నూలు- ఓర్వకల్లు క్లస్టర్ లో మిలిటరీ డ్రోన్లు, రోబోటిక్స్ , అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెట్స్ తయారీ చేయాలని కోరాం. తిరుపతి ఐఐటీలో డీఆర్ డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పెట్టాలని కోరాం. శ్రీహరి కోట సమీపంలో 2 వేల ఎకరాల్లో ఒక స్పేస్ సిటీ ఏర్పాటు చేసి, ప్రైవేటు శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, లాంచింగ్ చేయటానికి సహకరించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సముద్రంలో కలిసే నీళ్లను పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తరలిస్తాం. కేంద్రం అనుమతి ఇవ్వగానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు