వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. మండపేట, మదనపల్లె పురపాలక, గొల్లప్రోలు నగర పంచాయతీ, పెనుకొండ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్-2.0 గతంలో మాదిరిగా ఉండదు. సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కాదు. అందరికంటే కార్యకర్తలే పైస్థాయిలో ఉంటారు. ప్రతి కార్యకర్తకూ నేడు జరుగుతున్న అన్యాయాలు, కష్టాలను చూస్తున్నా. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నవాళ్లు కష్టాలు పెడతారు. పర్వాలేదు. ఎవరు అన్యాయం చేసినా రెడ్ బుక్ అనను మీ ఇష్టం వచ్చిన పుస్తకంలో పేరు రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గెలిచాక వాటన్నింటినీ పక్కన పెట్టింది. వాటిని అమలు చేసే బాధ్యతను పూర్తిగా విస్మరించారని జగన్ అని అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు