ఐపీఎల్ సీజన్ 18 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైయర్ లో పంజాబ్ కింగ్స్ పై గెలిచి ఫైనల్ చేరింది. ఇక తాజాగా జరిగిన రెండో ఎలిమినేటర్ లో గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో క్వాలిఫైయర్ కి అర్హత సాధించింది. రెండో క్వాలిఫైయర్ లో పంజాబ్ కింగ్స్ తో ముంబై నిర్ణీత తలపడనుంది.
ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 81 (50; 9×4, 4×6) కీలక మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. జానీ బెయిర్ స్టో 47 (22; 4×4, 3×6), సూర్య కుమార్ యాదవ్ 33 (20; 1×4, 3×6), తిలక్ వర్మ 25 (11; 3×6), హార్దిక్ పాండ్య 22 (9; 3×6) పరుగులతో ముంబై భారీ స్కోరు సాధించడంలో తమ వంతు కృషి చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్, ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు చొప్పున పడగొట్టగా…సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. సాయి సుదర్శన్ 80 (49; 10×4, 1×6) మరోసారి తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 48 (24; 5×4, 3×6) మంచి ప్రదర్శన కనబరిచాడు. రూథర్ఫోర్డ్ (24), కుశాల్ మెండీస్ (20) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు, బుమ్రా, గ్లీసన్, శాంట్నర్, ఎ.సింగ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు