ఢిల్లీలో తాజాగా జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వార్షిక వ్యాపార సదస్సు 2025లో ఏపీ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. ‘‘ఆర్థిక వృద్ధి, స్థిరత్వం: ఆంధ్రప్రదేశ్ బ్లూప్రింట్’’ అనే అంశం పై ఆయన ప్రసంగించారు.
1995లో దావోస్ వెళ్తున్నా అంటే, అప్పట్లో నన్ను వెళ్లొద్దు అనే వారు. పారిశ్రామికవేత్తలతో భేటీలు అయితే, ఓట్లు పోతాయని బెదిరించే వారని అన్నారు. సిఐఐని మొదటి నుండి తాను ప్రోత్సహించానని, వారి తరుపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని కోరారు.దేవుడు నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం ఇచ్చాడు. అమరావతిని దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ప్లాన్ చేస్తున్నాం. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాను. విశాఖలో టీసీఎస్ మొదలవుతోంది.. ఆర్సెల్లార్ మిట్టల్ పరిశ్రమ ప్రారంభం కాబోతోంది. విశాఖకు గూగుల్ రాబోతోంది. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయి. సోలార్ , విండ్ , పంప్డ్ ఎనర్జీ.. అన్నింటిలోనూ ఏపీ ముందు వరుసలో ఉంది. గ్రీన్ ఎనర్జీ కోసం ఎన్నో కంపెనీలు చాలా ఆసక్తిగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతిని దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ప్లాన్ చేస్తున్నాం:CII కాన్ఫరెన్స్ 2025లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read