లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్ రెండో రోజు ఆట లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. సౌతాఫ్రికాను మొదటి ఇన్నింగ్స్ లో 138 పరుగులకే కట్టడి చేసి ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో రోజు 43-4 ఓవర్ నైట్ స్కోరు తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి 138 పరుగులకే పరిమితమయింది. పాట్ కమ్మిన్స్ 6 వికెట్లతో రాణించాడు. డేవిడ్ బెడింగ్ హామ్ (45), తెంబ బావుమా (36) మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు. ఇక అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా కూడా సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కీలక వికెట్లు కోల్పోయింది. అలెక్స్ కేరీ (43), లబుషేన్ (22) పరుగులు చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 148 పరుగుల వద్ద నిలిచింది. స్టార్క్ (16 నాటౌట్), లైయన్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా 3 వికెట్లు, లుంగి ఎంగిడి 3 వికెట్లు, ముల్డర్, జాన్సన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
Previous Articleఅహ్మదాబాద్ విమాన ప్రయాణంలో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్
Next Article విమాన ప్రమాద ఘటనాస్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ