అగ్ర కధానాయకుడు ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది.’మిర్జాపూర్’ వంటి వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న దివ్యేందు శర్మ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు దివ్యేందు పుట్టినరోజు సందర్భంగా, ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘రామ్ బుజ్జి’ అనే పాత్రలో దివ్యేందు కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్, ఇతర ముఖ్య పాత్రల్లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో, పలు భాషల్లో ‘పెద్ది’ని రూపొందిస్తున్నారు. 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా పై అంచనాలు పెంచేసింది.
‘పెద్ది’ లో రామ్ బుజ్జిగా దివ్యేందు… బర్త్ డే సందర్భంగా పోస్టర్ విడుదల చేసిన మూవీ టీమ్
By admin1 Min Read