ఇంగ్లాండ్ లోని లీడ్స్ వేదికగా సచిన్ టెండూల్కర్- అండర్సన్ ట్రోఫీ నేడు ప్రారంభమైంది. మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. యశస్వీ జైశ్వాల్ 101 (158; 16×4, 1×6), కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 127 నాటౌట్ (175; 16×4, 1×6) సెంచరీలతో కదం తొక్కారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. జైశ్వాల్ అవుటైనా ఇంకా శుభ్ మాన్ గిల్ క్రీజులో ఉన్నాడు. అతనికి తోడుగా రిషబ్ పంత్ 65 నాటౌట్ (102; 6×4, 2×6) పరుగులతో నిలిచాడు. కే.ఎల్.రాహుల్ (42) పర్వాలేదనిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2 వికెట్లు, కార్సే 1 వికెట్ తీశారు.
Previous Articleఏపీలో కాగ్నిజెంట్ టెక్నాలజీ…విశాఖలో రూ.1583 కోట్ల పెట్టుబడులు
Next Article విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ