తన వాహానం కింద పడి ఒక వ్యక్తి మరణించిన దుర్ఘటనకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. చంద్రబాబు గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారని జగన్ అన్నారు. గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా? అని ప్రశ్నించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ సీఎంకు కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్ అని స్పష్టం చేశారు.జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్‌పార్టీలను జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరని అన్నారు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా? అని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు