శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ఏపీ సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. జులై తొలివారంలోనే శ్రీశైలం నిండటం శుభపరిణామమని పేర్కొన్నారు. రాయలసీమ రతనాల సీమ కావాలని, రాష్ట్రం సుభిక్షం కావాలని శ్రీశైల మల్లన్నను ప్రార్థించాను. సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వ ప్రణాళికలు ప్రజలకు వివరించారు. సమర్థ నీటి నిర్వహణతో సాగునీటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రయత్నంలో అందరి సహకారం కోరారు. జల హారతి అనంతరం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. మంత్రి నిమ్మల రామా నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Previous Articleచరిత్ర సృష్టించిన భారత ఆస్ట్రోనాట్… రోదసి లోకి శుభాంశు శుక్లా
Next Article ఐసీసీ ర్యాంకింగ్స్ లో మరింత ముందుకు శుభ్ మాన్ గిల్