అగ్ర కధానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. అన్ని షూటింగ్‌లు అయిపోయాయి. ఇప్పుడిక థియేటర్ల వంతు ‘ఓజీ ఆశ్చర్యపరచబోతోందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఈ కీలక అప్‌డేట్‌ను అందించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా పవన్ కల్యాణ్ సరికొత్త, పవర్ ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈచిత్రం పై ఎంతటి భారీ అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ కు వీరాభిమాని అయినటువంటి దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ కథలో పవన్ కల్యాణ్ ఒక శక్తివంతమైన, ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు