టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల మొదటి ఇన్నింగ్స్ స్కోర్లు సమమయ్యాయి. మూడో రోజు ఆటలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 119.2 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌటయింది. అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులే చేసిన విషయం తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (100) సెంచరీతో అదరగొట్టాడు. లార్డ్స్ లో రెండు సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రిషబ్ పంత్ (74), రవీంద్ర జడేజా (72) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. కరుణ్ నాయర్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు.
Previous Articleఒక శకం ముగిసింది…విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
Next Article వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా స్వైటెక్