సీనియర్ నటి, పద్మభూషణ్ గ్రహీత బి. సరోజాదేవి కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. బెంగళూరులోని తన నివాసంలో ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో ఆమె నటించారు. దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో పలు సినిమాల్లో నటించారు. 1942 లో కర్ణాటకలో జన్మించారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ కన్నడ సినిమాలతో అభిమానులను అలరించారు. ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘పెళ్లిసందడి’ (1959)లో తెలుగులో తెరంగేట్రం చేశారు. దీనికంటే ముందు పాండురంగ మహత్యం, భూకైలాస్ ముందుగా విడుదలై గుర్తింపునిచ్చాయి. సీతారామ కల్యాణం (1961), జగదేకవీరునిజగదేకవీరుని కథ, శ్రీకష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు , దానవీర శూర కర్ణ , అల్లుడు దిద్దిన కాపురం వంటి తదితర చిత్రాల్లో నటించారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గాను ప్రభుత్వం ఆమెను 1969లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
Previous Articleలార్డ్స్ టెస్టు: రాణించిన భారత బౌలర్లు…భారత విజయ లక్ష్యం 193
Next Article స్పేస్ పాలసీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం