ఇటీవల కాలంలో సౌత్ లో హిందీ భాషపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషను నేర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, అయితే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియంకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు . పేద పిల్లలకు పోటీతత్వాన్ని పెంపొందించేందుకు హిందీని ఒక భాషగా బోధించవచ్చు. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరిగితే విద్యార్థులు గ్లోబల్ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని అన్నారు. మాతృభాషను తప్పనిసరిగా మొదటి భాషగా ఉంచాలని, రెండవ భాషగా హిందీ లేదా ఇతర భాషలను ఎంచుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియం విద్యా వ్యవస్థ కొత్త మార్పుకు నాంది పలుకుతుంది. ఇది విద్యార్థులకు బంగారు బాట వేస్తుందని ఆయన అన్నారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ యేతర పక్షాలు చేస్తున్న వాదనలను జగన్ సమర్థించారు. అయితే, భాషా వివాదంపై రాజకీయ రంగు పులుముకోవడం కంటే, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యా విధానాన్ని రూపొందించాలని జగన్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఇప్పటికైనా మేల్కొని, తప్పులను సరిదిద్దుకోవాలన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు