టెండూల్కర్ -అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన చివరిదైన 5వ టెస్టులో భారత్ సంచలన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ టెస్టులో గెలిచి సిరీస్ ను య 2-2తో సమం చేసింది. 374 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 339/6తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. జేమీ స్మిత్ (2), జేమీ ఒవర్టన్ (9), జోష్ టంగ్ (0)లను భారత బౌలర్లు త్వరగానే ఔట్ చేశారు. అట్కిన్సన్ (17) చివరి వికెట్ గా వెనుదిరిగాడు. మహ్మద్ సిరాజ్ 5, ప్రసీద్ కృష్ణ 4, ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులు చేసింది.
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ:5వ టెస్టులో భారత్ సంచలన విజయం… సిరీస్ 2-2తో సమం
By admin1 Min Read