ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇక ఇటీవల తన సింగపూర్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రులకు సీఎం వివరించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే ఆగస్ట్ 15వ తేదీ.. స్వాతంత్ర దినోత్సవమని.. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులు విన్నవించారు. కానీ సమయాన్ని సర్దుబాటు చేసుకుని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని వారికి సీఎం సూచించారు. సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు పంచుకున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు