ఎన్టీఆర్ -హృతిక్ రోషన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వార్ 2’ సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. మొదటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు మరింత పెంచేస్తూ, చిత్రబృందం తాజాగా ఓ అదిరిపోయే పాట ప్రోమోను విడుదల చేసింది. ‘సలామ్ అనాలి’ పాట ప్రోమోలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి తమ డ్యాన్స్ తో అలరించారు. ఈ పాట పూర్తి వీడియోను థియేటర్లలోనే చూడాలంటూ చిత్ర బృందం ప్రకటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.
The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease… #SalamAnali full song in theatres only! pic.twitter.com/ArvExjqhkI#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…
— Jr NTR (@tarak9999) August 7, 2025