సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేదల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా పారిశ్రామిక వేత్తలతో పీ-4 సమావేశంలో మాట్లాడుతూ నాడు పెట్టుబడులు అడిగాను… నేడు పేదలకు సాయం చేయాలని కోరుతున్నాను.నాటి జన్మభూమి సమాజం కోసం… నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా మారి పేద కుటుంబాల అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపించాలనే ఉద్దేశంతో తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు పిలుపునకు సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, ఎన్నారైల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి ఒకేసారి 729 కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఇంకా పలువురు ఎన్నారైలు, స్థానిక వ్యాపారవేత్తలు వందలాది కుటుంబాలను, పాఠశాలలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఆర్థికంగా సాయం చేయలేని వారు తమ విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పంచేందుకు వీలుగా ‘కో-స్పాన్సర్’ విధానాన్ని కూడా తీసుకువస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు