భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ ప్రాక్టీస్ ను ముమ్మరం చేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత ఈ పేసర్ మళ్లీ బరిలో దిగలేదు. ఇక తిరిగి జుట్టులోకి పునరాగమనం కోసం షమి నెట్స్ లో కష్టపడుతున్నాడు. ఈ ఏడాది మొదట్లో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్న షమీ సాధన ప్రారంభించాడు. బెంగళూరులో భారత్- న్యూజిలాండ్ తొలి టెస్టు ముగిసిన తర్వాత నెట్లోకి అడుగుపెట్టి భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆధ్వర్యంలో సాధన చేశాడు. భారత సహాయక కోచ్ అభిషేక్ నాయర్కు చాలా సేపు బంతులు వేశాడు. కొంతసేపు ఫీల్డింగ్ డ్రిల్స్ కూడా చేశాడు. ఈ సెషన్ ముగిశాక మోర్కెల్ షమి సుదీర్ఘంగా మాట్లాడాడు.
భారత జట్టులోకి పునరాగమనం చేయాలన్న సంకల్పంతో సాధన. మొదలెట్టిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ
By Indu1 Min Read
Previous Articleస్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Next Article రజత పతకం సాధించిన భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి