భారీ అంచనాల మధ్య విడుదలై ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న చిత్రం దేవర. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ మూవీ ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
దేవర.. కొన్ని రోజులుగా బాక్సాఫీస్ వద్ద మారుమోగుతున్న పేరు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వా జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇందులో తండ్రికొడుకుల పాత్రలో ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు తారక్. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, శ్రుతి మరాఠే, చైత్ర రాయ్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.