రాష్ట్రంలో రహదారుల నిర్వహణపై వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగించే యోచన చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో రోడ్లపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయని ఇప్పుడు రోడ్ల మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయని అన్నారు. జనవరిలో పండుగల సందర్భంగా రాష్ట్రానికి ఎవరైనా వస్తే మెరుగైన రహదారులు కనిపించాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ముందుకుపోతున్నట్లు తెలిపారు.
మన వద్ద డబ్బుల్లేవని అయితే మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుందని అన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో ఉన్న రోడ్ల నిర్వహణ జాతీయ రహదారుల మాదిరిగా టెండరు పిలిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామం నుండి మండల కేంద్రానికి ఎక్కడా టోల్ ఫీజు ఉండదని మిగిలిన చోట్ల టోల్ ఉంటుంది. అది కూడా బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే యూజర్ ఛార్జి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విధానం బాగుంటుందని సభ్యులంతా భావిస్తే ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాల్లో అమలు చేద్దామని సీఎం అసెంబ్లీలో పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు