విశాఖపట్నం నగరంలో వాయు కాలుష్యం పై శాసనమండలిలో నేడు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈసందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానాలు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగినట్లు తెలిపారు. అయితే వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యయనం చేస్తోందని ఆ నివేదిక 2025 జనవరిలో వస్తుందని వివరించారు. అది వచ్చిన అనంతరం దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తోందన్నారు. కంప్రెస్సడ్ బయో గ్యాస్ వినియోగంతో పొల్యూషన్ తగ్గిస్తామని పేర్కొన్నారు. గుంటూరు విశాఖపట్నం లలో ఘన వ్యర్ధాలతో విద్యుత్ తయారీ చేపడుతున్నామని దానిని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. కాలుష్య నివారణకు ఎన్జీవోలతో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖలో క్షేత్ర స్థాయిలో పర్యటించి కాలుష్య నివారణపై సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖలో భారీ పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు.
Previous Articleఅదానీపై కేసు.. కాంగ్రెస్ ఏమందంటే..?
Next Article విడాకుల వచ్చే వరకూ…భార్యకు అన్నింటా హక్కు…!