స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీలు వెంట పరుగులు పెడుతున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన నేడు మాట్లాడుతూ అందరం కలిసి పనిచేసి పెట్టుబడులు సాధించి, ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లాగే విశాఖ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
2014-19 మధ్యలో పెద్ద ఎత్తున ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలు తీసుకొచ్చాం. తిరుపతి, కడప కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఏర్పాటు చేయించినట్లు వివరించారు. మా హయాంలో 53 కంపెనీలు, 15 వేల కోట్ల పెట్టుబడి, 97 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నాం. అప్పటివరకూ ఏపీలో తయారయ్యే సెల్ ఫోన్లు లేవు. చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలోనే సెల్ ఫోన్లు 25 శాతం తయారయ్యే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని లోకేష్ అన్నారు.
రాష్ట్ర విభజనతో కోలుకోలేని నష్టం జరిగిందని అయితే అనంతరం నవ్యాంధ్ర పునర్నిర్మాణం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతోపాటు… రాష్ట్రమంతా అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా పనిచేశారని ఈసందర్భంగా పేర్కొన్నారు.
టీడీపీ సర్కారు 2014-19 కాలంలో 53 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. జగన్ వచ్చాక 27 కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. వోల్టాస్, మైక్రోమ్యాక్స్, జీఎం మ్యాడ్యూల్ వంటి కంపెనీలు వెళ్లిపోయాయి. అతి ఎక్కువ పన్ను చెల్లించే ప్రఖ్యాత కంపెనీ అమరరాజాపై జగన్ సర్కారు వేధింపులు పరాకాష్టకు చేరడంతో వారు పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం మేకింగ్ ఇండియా అద్భుత ఫలితాలు ఇస్తోందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం కృషితో దేశంలోనే టీవీలలో 40 శాతం, ఏసీలలో 50 శాతం ఏపీ నుండి తయారు కావడం మన రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే వేలాది టీచర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశాం. చాలా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం.
భారతదేశంలోనే తొలిసారి డేటా పాలసీ తీసుకొచ్చాం. డేటా సెంటర్లకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ, ఇతర సదుపాయాలు కూడా సమకూర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.
దేశంలోనే ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, రాయితీలు అందిస్తున్నాం. అందుకే టిసిఎస్, రిలయన్స్ వంటి ప్రఖ్యాత సంస్థలు ఏపీకి వస్తున్నాయని తెలిపారు.
దేశంలోనే ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, రాయితీలు అందిస్తున్నాం: ఏపీ మంత్రి లోకేష్
By admin2 Mins Read
Previous Articleభారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన సూచీలు
Next Article అదానీని అరెస్ట్ చేయాలి: రాహుల్ గాంధీ