బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. మూడోరోజు 487-6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 172-0తో మూడోరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ యశస్వీ జైశ్వాల్ 161 (297; 15×4, 3×6) శతకంతో సత్తా చాటాడు. ఆసీస్ తో ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఈ ఘనత సాధించాడు. కే.ఎల్.రాహుల్ 77 (176; 5×4)లతో రాణించాడు. దేవ్ దత్ పడిక్కల్ 25 (71; 2×4) , వాషింగ్టన్ సుందర్ 29(94;1×4) కొద్దిసేపు నిలకడగా ఆడారు. పంత్ (1), ధృవ్ జురేల్ (1) విఫలమయ్యారు. ఇక సీనియర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 100 నాటౌట్ (143; 8×4, 2×6) లతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నితీష్ రెడ్డి 38 నాటౌట్ (27; 3×4, 2×6) బ్యాట్ ఝళిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి 533 పరుగుల ముందంజలో ఉంది. ఆస్ట్రేలియా లక్ష్యం 534 పరుగులు. ఇక ఆసీస్ బౌలర్లలో లైయన్ 2 వికెట్లు పడగొట్టగా…స్టార్క్, హేజల్ వుడ్, కమ్మిన్స్, మార్ష్ ఒక్కో వికెట్ తీశారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ: ఆసీస్ ముందు భారీ లక్ష్యం: జైశ్వాల్, కోహ్లీ శతకాలు
By admin1 Min Read