పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈ నెల 26న మాత్రం ఉభయసభలకు సెలవు ఉంటుంది. ఇక సమావేశాల నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం వల్లే దేశంలో సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకురాగలిగామని అణగారిన వర్గాలకు సమున్నత స్థానం కల్పించామని పేర్కొన్నారు. ఎటువంటి వివక్ష లేకుండా అన్నివర్గాల ప్రజలు సమాన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కారణం రాజ్యాంగమేనని అన్నారు.
రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. మన ఆలోచనలో ఉన్నత ప్రమాణాలు ఉన్నప్పుడే ప్రభుత్వ సంస్థలను గౌరవించగలమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈనెల 26న పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగే ‘రాజ్యాంగ దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారని, రాజ్యాంగ పీఠికను చదువుతారని వెల్లడించారు.
భారత రాజ్యాంగం వల్లే దేశంలో సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకురాగలిగాం: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
By admin1 Min Read
Previous Articleవచ్చే ఏడాది జనవరిలో వికసిత భారత్ యువ నేతల సమ్మేళనం: ప్రధాని మోడీ
Next Article తాత విగ్రహం వద్దే మా పెళ్లి: నాగచైతన్య