‘పుష్ప’ ఈవెంట్‌లో నటి రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పెళ్లి గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.‘‘సినీ పరిశ్రమలో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? లేదా బయట వ్యక్తిని పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా?’’అని హోస్ట్ ప్రశ్నించింది.
‘‘ఇది అందరికీ తెలిసిన విషయమే’’ అని రష్మిక నవ్వులు పూయించారు.ఆమె సమాధానంతో ప్రాంగణం అంతా గోల చేశారు.శ్రీలీల, బన్నీ, దేవిశ్రీప్రసాద్ నవ్వులు పూయించారు
ఆమె విజయ్ దేవరకొండ గురించి పరోక్షంగా చెప్పారని భావిస్తున్నారు.తనకు గోవాలో బంగ్లా ఉందని వస్తోన్న కథనాల్లో నిజం లేదన్నారు.తనకు సొంత ఇల్లు లేదని తాను అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నానని చెప్పారు.వార్తల్లో వచ్చే అన్నింటినీ నమ్మవద్దన్నారు.