అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహార వీరమల్లు’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పీరియాడికల్ కథాంశంతో రూపొందుతోంది. అత్యద్భుతమైన అనుభవాన్ని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవల చిత్ర బృందం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించింది. పవన్ తో పాటు 400 – 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు. ఈ సన్నివేశం అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది.
‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఈ వారాంతంలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుందని పవన్ సహా భారీగా ఆర్టిస్ట్ లు ఈ చిత్రీకరణలో పాల్గొననున్నారని తెలిపారు.
ఇక ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ అలరించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎంకీరవాణీ సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు ఈచిత్రానికి పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈచిత్రం వచ్చే ఏడాది మార్చిలో పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Previous Articleఅదృష్టం అంటే ఇదే.. రాత్రికి రాత్రే సంపన్నుడు అయిన సాధారణ వ్యక్తి
Next Article ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ