ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో ఐదో గేమ్ కూడా మరో డ్రాగా ముగిసింది. భారత యువ ఆటగాడు గుకేశ్ డిఫెండింగ్ చాంపియన్ చైనా క్రీడాకారుడు డింగ్ లిరెన్ లీ మధ్య జరిగిన ఐదో గేమ్ ఫలితం తేలకుండా పూర్తయింది. ఈ గేమ్ లో కూడా భారత సంచలనం గుకేశ్ దూకుడుగా ఎత్తులు వేస్తూ లీరెన్ తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన ఈ గేమ్ లో ఇద్దరు ఆటగాళ్లు 40 ఎత్తుల తరువాత పాయింట్లు పంచుకున్నారు. ఇక ఈ ఛాంపియన్ షిప్ లో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి చెరొక విజయంతో 2.5-2.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. ఇంకా 9 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ముందు 7.5 పాయింట్లు గెలిచిన ఆటగాడు విజేతగా నిలుస్తాడు.
Previous Articleఎన్టీఆర్ చిత్రంలో తెలుగు అమ్మాయి…!
Next Article ఎఫ్.బి.ఐ చీఫ్ గా కాష్ పటేల్…!