గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’. తాజాగా ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ వీక్షించారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఈ చిత్రాన్ని చూశారు.
2002లో గుజరాత్‌లో గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకొని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ తెరకెక్కించారు. విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు. నవంబర్ 15న ఇది విడుదలైంది.