ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధించగలరని మేం బలంగా నమ్ముతాం. అందుకే దివ్యాంగులకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని అణువణువునా నింపుకుని అందరితో సమానంగా ముందడుగేస్తోన్నారని పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం మూడు చక్రాల మోటారు వాహనాలు, స్వయం ఉపాధి పొందేందుకు రూ.1 లక్ష సబ్సిడీతో రుణాలు అందించి వారికి అండగా నిలిచామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్ ను రూ. 3 వేల నుండి రూ. 6 వేలకు పెంచి ఇస్తున్నాం. దేశంలో దివ్యాంగులకు రూ. 6 వేలు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని చెప్పడానికి నేను చాలా సంతోష పడుతున్నాను. అవరోధాలను, సవాళ్లను అధిగమించి….మీరు జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాని చంద్రబాబు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధించగలరని మేం బలంగా నమ్ముతాం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleఏక్నాథ్ శిండేకు అస్వస్థత…!
Next Article ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు